Breaking News

పేర్ని నానిపై మరో కేసు నమోదు

Published on Wed, 01/28/2026 - 08:57

సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. 

నూజివీడులో జరిగిన వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.

ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్‌సీపీ ఎన్ని  ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. 

ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్‌ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్‌లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్‌ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది.

పేర్ని నానిపై మరో అక్రమ కేసు నమోదు..

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)