Breaking News

సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం

Published on Sat, 07/05/2025 - 16:01

సాక్షి, విశాఖపట్నం: చందనోత్సవం ఘటన మరువకముందు సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. తొలిపావంచా వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

కూటమి ప్రభుత్వంలో ఆలయాల పట్ల, భక్తుల పట్ల వహిస్తు‍న్న నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.  సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం(జులై 5న) తొలిపావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డూ కూలిపోయింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిందని నిర్ధారణ అయ్యింది.  షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన చేస్తున్నారు. 

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 30వ తేదీన ఈదురు గాలితో నాసిరకం గోడ కూలిపోయి క్యూ లైన్‌లో ఉన్న భక్తుల మీద పడింది. ఆ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి కూడా. ఇది మరువకముందు అదే ఆలయ ప్రాంగణంలో మరో ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

అంతకు ముందు.. ఈ ఏడాది తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచా­రాలు, అనూహ్య ఘటనలు భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం.. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)