Breaking News

చంద్రబాబు డైరెక్షన్‌లో అమరావతి మెగా సీరియల్

Published on Sat, 11/29/2025 - 15:40

సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి  అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే  పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు

..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.

‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్‌ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్‌. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్‌కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.

‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు

	Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!

..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.

‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక‌ డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)