Breaking News

అందుకే బంగారం కొంటున్నా.. కియోసాకి వ్యూహం ఇదే!

Published on Thu, 11/05/2026 - 08:45

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పడిపోతున్నాయని చాలామంది ఆందోళన చెందుతున్న వేళ.. తాను మాత్రం మరిన్ని కొనుగోలు చేశానని చెబుతున్నారు.

అసలు సమస్య ఏమిటంటే?
మార్కెట్ పడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, తాను నమ్మిన పెట్టుబడులను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశంగా చూస్తానని అభిప్రాయపడ్డారు. అయితే.. కియోసాకి దృష్టిలో అసలు సమస్య బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు తగ్గడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ అప్పులు పెరుగుతుండటమే అసలు ఆందోళనకరమైన విషయమని చెబుతున్నారు.

ముఖ్యంగా.. అమెరికా అప్పులు పెరుగుతుండటంపై కియోసాకి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పాలకులు అవసరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని, విద్యావ్యవస్థలో కూడా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కల్పించడం లేదని విమర్శించారు.

ఫియట్ కరెన్సీ
మరో ముఖ్యమైన అంశం ఫియట్ కరెన్సీ (Fiat Money). అంటే.. భారత రూపాయి, అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ అధికారంతో చెలామణిలో ఉండే కరెన్సీ. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు డబ్బు సరఫరాను పెంచినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది.

ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. రూ.15కే అన్‌లిమిటెడ్ డేటా!

ఉదాహరణకు, గతంలో రూ.100తో కొనుగోలు చేసిన వస్తువులు ఇప్పుడు అదే ధరకు దొరకకపోవచ్చు. అందుకే కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం నగదు రూపంలో దాచుకోవడం కంటే బంగారం, వెండి వంటి ఆస్తుల గురించి కూడా ఆలోచించాలని కియోసాకి అభిప్రాయపడుతున్నారు.

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)