Breaking News

భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. సంజయ్‌ గుప్తా లవ్‌స్టోరీ..

Published on Sat, 10/31/2026 - 16:56

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా మరణవార్త చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భార్య అనురాధ లేఖి గుప్తాతో ఆయన ప్రేమకథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. అయితే మరో ఆరేళ్ల తర్వాత తిరిగి ఒక్కటై రెండోసారి వివాహం చేసుకున్నారు. వీరి విడిపోవడానికి అండర్‌వరల్డ్‌ మాఫియాతో తలెత్తిన సమస్యలు కూడా పరోక్ష కారణమయ్యాయని సంజయ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

(ఇదీ చదవండి: రేపే రామ్ చరణ్ RC17 ముహూర్తం.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే?)

విడిపోయినప్పటికీ
అనురాధతో సుమారు రెండున్నరేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంజయ్‌ గుప్తా.. 1997లో ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల కారణంగా 2003లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ సంజయ్‌ మాత్రం అనురాధను మర్చిపోలేకపోయారు. తిరిగి ఆమె ప్రేమను పొందాలని ప్రయత్నించారు. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో 2009లో మరోసారి ఆమెను పెళ్లి చేసుకున్నారు.

విడాకులకు అండర్‌వరల్డ్‌ సమస్యలు..
గతంలో ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ తమ విడాకుల వెనుక ఉన్న పరిస్థితులను వివరించారు. ‘అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న కొందరితో తనకు ఓ విషయంలో అపార్థాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకునేందుకు కొంతకాలం పాటు ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చేది. ఇందుకోసం ఓ స్నేహితుడు తన ఫ్లాట్‌ను ఇచ్చాడు. అక్కడి నుంచే వారితో మాట్లాడేవాడిని. ఈ వ్యవహారాల గురించి ఆమెకు చెప్పలేదు. నేను ఎక్కడికి వెళ్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది కూడా వివరించలేని పరిస్థితి ఉండేది. దీంతో నాకు వేరే మహిళతో సంబంధం ఉందేమోనని అనురాధ అనుమానించింది. ఈ పరిణామాలన్నీ తమ మధ్య దూరాన్ని పెంచాయి. చివరకు విడాకులకు దారితీశాయి. తర్వాత అన్నీ చెప్పడంతో మళ్లీ అర్థం చేసుకుని ఒక్కటయ్యాం’ అని  సంజయ్‌ గతంలో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ..)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)