అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!
Breaking News
మెగాస్టార్ మెగావర్స్ టాక్ షో.. ఓటీటీ కీలక ప్రకటన
Published on Thu, 10/29/2026 - 16:41
మెగాస్టార్ మెగా షోకు అంతా సిద్ధమైంది. ఆయన హోస్ట్‌గా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షోకు మెగావర్స్ పేరు ఖరారు చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్పటి నుంచి ఓటీటీకి వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
(ఇది చదవండి: అలాంటి వారు కల్ట్ చూడొద్దు.. ఇదే నా రిక్వెస్ట్: విశ్వక్ సేన్)
ఈ మెగావర్స్ టాక్ షో త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మాస్ కీ గ్రామర్.. స్టైల్‌కి నిర్వచనం.. మెగాస్టార్ అంటూ పోస్ట్ చేసింది. ఈ మెగా షో త్వరలోనే మీ ముందుకు రానుందని ప్రకటించింది. కాగా.. చిరు గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి హోస్టింగ్ చేసి తనదైన శైలిలో మెప్పించాడు. 'మెగావర్స్' పేరుతో వస్తోన్న టాక్ షోకు బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్'కి పనిచేసిన ప్రముఖ రచయిత బీవీఎస్ రవి పనిచేయనున్నారు.
Mass ki grammar, style ki definition. Megastar is here. 👑❤️ Watch Chiranjeevi’s Megaverse, coming soon, Only on Netflix. #MegaverseOnNetflix https://t.co/cJxt5MrcCj
— Netflix India South (@Netflix_INSouth) October 29, 2026
Tags : 1