Breaking News

'మనుషులకు జ్వరమొచ్చినా బర్రెలకే ప్రయారిటీ'.. డైరెక్టర్ ఎమోషనల్

Published on Thu, 10/15/2026 - 11:52

అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా బరాత్ పేరుతో ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బద్రప్ప గాజుల ఫుల్ ఎమోషనల్ ‍అయ్యారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వేదికపైకి పిలిపించి మాట్లాడారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదని అన్నారు. ఏ పని చేయకుండా గాలికి తిరిగానని..నా కోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఈ రోజు వేదికపైకి పిలిచి అమ్మా, బాపును మనస్ఫూర్తిగా హత్తుకోవాలని ఉందని బద్రప్ప భావోద్వేగానికి గురయ్యారు.

డైరెక్టర్ బద్రప్ప మాట్లాడుతూ.."నాకొక చిన్న కోరిక ఉందండి. నా చిన్నప్పుడు మా బాపు నన్ను ఎత్తుకుని ఉంటాడు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదు. మా ‍అమ్మ, నాన్నను వేదికపై హగ్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఏ పని చేయకుండా గాలికి తిరిగాను. నా కోసం చాలా కష్టపడ్డారు. బాపు నేను సినిమా తీసినా. నీ పేరు నిలబెడతా. ఇప్పటికీ పొలంలో పనిచేస్తారు. మా ఇంట్లో మనుషులకు జ్వరం వచ్చినా నాన్న బర్రెలనే పట్టించుకుంటాడు. ఇప్పటి వరకు వీళ్ల సంతోషం కోసం నేను ఏమి చేయలేదు. ఇప్పుడు మీ గురించే సినిమా తీసినా' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)