Breaking News

చరిత్రకు నిలయం... తిరుమల మ్యూజియం!

Published on Sun, 10/11/2026 - 05:45

తిరుమలలో శ్రీవారి దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే, ఆ దర్శనం వెనుక దాగిన శతాబ్దాల చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే మరో ప్రపంచం ఇప్పుడు భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆధునికీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సెప్టెంబర్‌ 16న ప్రారంభమైంది.

తిరుమల చరిత్ర, ఆలయ నిర్మాణ వైభవం, శాసనాలు, రాజవంశాల అనుబంధం, అన్నమయ్య భక్తి సాహిత్యం, పురాతన కళాఖండాలను ఆధునిక సాంకేతికతతో భక్తులకు పరిచయం చేయాలన్న ఆలోచన కొన్నేళ్ల క్రితమే మ్యూజియం ప్రాజెక్టు మొదలైంది. 2019లోనే టీటీడీ మ్యూజియానికి కొత్త రూపు ఇచ్చే మాస్టర్‌ప్లాన్‌ , 3డీ వర్చువల్‌ టెక్నాలజీపై ప్రణాళికలు ప్రకటించింది. 2022లో టాటా గ్రూప్, మ్యాప్‌ సిస్టమ్స్‌ సంస్థల నిపుణులతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఇప్పుడు ప్రారంభమైన మ్యూజియం 14 ఇంటరాక్టివ్‌ గ్యాలరీలతో, సుమారు 1.20–1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. మ్యూజియం ఆధునికీకరణలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో కళాఖండాల శాస్త్రీయ విభజన, ఆడిటింగ్, డిజిటలైజేషన్‌ కూడా ఉన్నాయి. మ్యూజియంలో ఉన్న 8,779 కళాఖండాల్లో 7,579 వస్తువుల డిజిటలైజేషన్‌  2022 నాటికే పూర్తయింది. ఇక విజయనగర సామ్రాజ్యంతో తిరుమలకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే వస్తువులు కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తాయి.

తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వరస్వామిపై వేలాది సంకీర్తనలు రచించారు. ఆ భక్తి సాహిత్యం తరతరాలకు అందేలా రాగిరేకులపై భద్రపరిచిన సంప్రదాయం తిరుమల సాహిత్య వారసత్వంలో అపూర్వమైనది.

మ్యూజియంలో మరో ఆసక్తికరమైన సంపద పురాతన నాణేలు. టీటీడీ నిర్వహించిన గత ప్రదర్శనల్లో రోమన్‌  కాలం, బ్రిటిష్‌ కాలానికి చెందిన నాణేలను కూడా ప్రదర్శించింది. తిరుమల చరిత్రను అర్థం చేసుకోవడానికి శాసనాలు కూడా అమూల్యమైన ఆధారాలు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశాలకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని మ్యూజియం గ్యాలరీల్లో పరిచయం చేస్తున్నారు.

ఇక సంగీత వాయిద్యాల కథ మరింత ప్రత్యేకం. శ్రీవారి ఆలయ సంగీత సంప్రదాయంలో శతాబ్దాలుగా ఉపయోగించిన వాయిద్యాలకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ మ్యూజియంలో సుమారు 400 ఏళ్ల నాటి భారీ ‘బ్రహ్మనగర’ వాయిద్యంతో పాటు సుమారు 12 అడుగుల ఎత్తైన ‘బాంకే’ అనే పురాతన బుగుల్‌ వంటి వాయిద్యాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆలయ సేవల్లో మోగిన ఆ వాయిద్యాలు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడి గతవైభవాన్ని గుర్తుచేస్తున్నాయి.

ఈ రూపానికి రావడానికి కూడా మ్యూజియం ఒక సుదీర్ఘ ప్రయాణం చేసింది. టీటీడీ 2019లో మ్యూజియానికి కొత్త రూపు, 3డీ ఆగ్మెంటెడ్‌ టెక్నాలజీ, తిరుమల ఆలయ ముఖ్య ప్రాంతాలను వర్చువల్‌గా చూపించే ప్రణాళికలను ప్రకటించింది. టీసీఎస్‌ సహకారంతో ఈ ఏడాది 14 ఇంటరాక్టివ్‌ గ్యాలరీలను అభివృద్ధి చేసి తుది దశకు తీసుకొచ్చారు. ప్రస్తుత మ్యూజియంలో హోలోగ్రాఫిక్‌ డిస్‌ప్లేలు, ఇంటరాక్టివ్‌ టెక్నాలజీ, శబ్ద–దృశ్య అనుభూతులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

అందుకే తిరుమలకు వచ్చే భక్తుడికి ఇది మరో రకమైన దర్శనం. గర్భగుడిలో స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తే, మ్యూజియంలో తిరుమల గతం దర్శనమిస్తుంది. రాజుల సేవలు, ఆచార్యుల సంప్రదాయాలు, అన్నమయ్య సంకీర్తనలు, శిల్పుల కళ, శాసనాల చరిత్ర, ఆలయ సంగీతం ఇవన్నీ ఒకే ప్రాంగణంలో కొత్త తరానికి పరిచయం అవుతున్నాయి. గతంలో మొదలైన ఆలోచనలు, మధ్యలో సాగిన ఆధునికీకరణ, తర్వాత పూర్తయిన పనులు.. ఇవన్నీ కలిసే నేటి శ్రీ వేంకటేశ్వర మ్యూజియం రూపుదిద్దుకుంది.

ఇదీ చదవండి: తిరుమల బంగారు గోపురం.. మొదట ఎవరు చేయించారంటే!

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)