కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..
Breaking News
విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు
Published on Sat, 08/01/2026 - 16:11
స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగిన రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఇదంతా జరగడానికి కొన్నాళ్ల ముందు వ్యక్తిగతంగా విషయాల కారణంగా ఈయన వార్తల్లో నిలిచారు.
(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)
భార్యతో విడాకులు, తండ్రి ముఖ్యమంత్రి అయినా సరే కొడుకు జేసన్ ఏం మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం లాంటివి జరిగేసరికి విజయ్, అతడి కొడుకు జేసన్‌ల మధ్య దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేసన్ మాటాలు వింటే అలాంటిదేం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి కావడంపై జేసన్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజయ్ రాజకీయ విజయాన్ని 'చారిత్రక విప్లవం'గా అభివర్ణించిన జేసన్.. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.
దర్శకుడిని కాకముందు తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలు ఉండేవని జేసన్ గుర్తుచేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని, తర్వాత క్రికెటర్ కావాలని బలమైన కోరిక ఉండేది. 'నాకు క్రికెట్ అంటే పిచ్చి. బ్యాటింగ్ చేయడం ఇష్టం. కానీ నా అసలు ప్రతిభ బౌలింగ్‌లోనే ఉంది. ఇంటర్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పడం, సినిమాలు తీయడంపై ఆసక్తి వచ్చింది. దీంతో ఇదే నా కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాక ఏం చేయాలనుకుంటున్నానో క్లారిటీ వచ్చింది. మా నాన్న విజయ్ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది నా కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్‌ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను' అని జేసన్ చెప్పుకొచ్చాడు.
జేసన్ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరో కాగా తమన్ సంగీతమందించాడు. లెక్క ప్రకారం జూలై 31నే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)
This is “HISTORIC REVOLUTION” - #JasonSanjay about his father @actorvijay’s Election Victory 🔥 pic.twitter.com/RWF6wkNIvP
— Vijay Fans Trends (@VijayFansTrends) August 1, 2026
Tags : 1