ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
Breaking News
సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?
Published on Wed, 07/15/2026 - 08:22
హీరోగా స్టార్డమ్ అనుభవించిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు జేసన్ సంజయ్ లండన్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చేసొచ్చాడు. ఈ క్రమంలోనే తండ్రిలా హీరో అవుతాడనుకుంటే జేసన్ మాత్రం అందరికీ షాకిస్తూ డైరెక్టర్ అయ్యాడు. సిగ్మా పేరుతో ఓ మూవీ తీశాడు. ఇది ఈ నెల 31న రిలీజ్ కావాలి కానీ 'జన నాయగన్' కారణంగా వాయిదా పడేలా ఉంది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)
ఈ సినిమాలోనే జేసన్ సంజయ్ ఒక పాటలోనూ నటించడం విశేషం. దీంతో పలువురు సినీ ప్రముఖులు జేసన్.. హీరోగానూ త్వరలో ఎంట్రీ ఇస్తారని భావించారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే విజయ్ కొడుకు హీరోగా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిని తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకే తమిళ్ కుమరన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ తీయబోయే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన 'సిగ్మా' రిలీజైన తర్వాత రానుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: తండ్రి దళపతి విజయ్ కోసం తగ్గిన కొడుకు)
Tags : 1