Breaking News

బాలీవుడ్ నయా ఆల్‌రౌండర్.. మోడ్రన్ 'ధురంధర్'

Published on Mon, 07/06/2026 - 11:31

బాలీవుడ్‌లోని అద్భుతమైన హీరోల్లో రణవీర్ సింగ్ ఒకడు. నేడు(జూలై 6)ఇతడి పుట్టినరోజు. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో పుట్టిపెరిగిన రణ్‌వీర్.. 2010లో యష్ రాజ్ ఫిల్మ్స్ రొమాంటిక్ కామెడీ 'బ్యాండ్ బాజా బారాత్‌'తో అనుష్క శర్మతో కలిసి నటుడిగా అరంగేట్రం చేశాడు, ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అరంగేట్ర అవార్డు అందుకున్నాడు. తర్వాత 2011లో 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్‌'లో మళ్లీ అనుష్కతో కలిసి నటించాడు. 2013లో లూటేరాలో విషాద పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'రామ్‌లీలా'తో దీపికా పదుకొణెతో కలిసి అదరగొట్టేశాడు. ఈ చిత్రమే వారి ప్రేమకథకు నాంది పలికింది. 2018లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

కెరీర్‌లో హిట్‌లతో పాటు ఫ్లాప్‌లు కూడా చూసిన రణవీర్.. '83' సినిమాలో నటించినందుకుగానూ 2022 ఫిబ్రవరిలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఇతడి కెరీర్ మలుపు తిప్పింది 'ధురంధర్'. 2025 డిసెంబర్ 5న తొలి పార్ట్ రిలీజై షాకిచ్చే బ్లాక్ బస్టర్ అయింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా వావ్ అనిపించే రీతిలో వసూళ్లు సాధించింది. ఈ ఏడాది మార్చిలో 'ధురంధర్ 2: ద రివెంజ్' రిలీజైంది. 1800 కోట్లకు పైగా వసూళ్లతో  'పుష్ప 2' రికార్డులను అధిగమించడంతో పాటు దేశ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించింది.

ఈ సినిమా సక్సెస్ టైంలో రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె సోషల్ మీడియాలో స్పందించకపోవడంతో వారి మధ్య విభేదాలు, విడాకుల గురించి పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత ఈ జంట ముంబై వీధుల్లో, ఒక రెస్టారెంట్‌లో కలిసి కనిపించడంతో వీటికి తెరపడింది. ఆపైన 2026 ఏప్రిల్‌లో తమ మొదటి బిడ్డ దువా పుట్టింది. తర్వాత కొన్నాళ్లకే రెండోసారి తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు దీపిక ప్రకటించింది.

వ్యక్తిగత జీవితంలో సంతోషంగా, వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న రణవీర్ సింగ్.. తన అరంగేట్రం నుంచి నేటి వరకు వైవిధ్యభరితమైన పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. 'బ్యాండ్ బాజా బారాత్‌'లో అమాయక కుర్రాడిగా, 'రామ్ లీలా'లో శృంగార కథానాయకుడిగా, 'లూటేరా'లో విషాద పాత్రలో, '83'లో కపిల్ దేవ్‌గా, ఇప్పుడు 'ధురంధర్'‌లో స్పై యాక్షన్ హీరోగా - ఇలా ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించిన రణవీర్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. తన 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: 'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు)

Videos

రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు

అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?

ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..

అంతా నా ఇష్టం

నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి

ఎవరో సైకోలు , పిచ్చోళ్లో తెలియదా..? జగన్ పై మాటలు జాగ్రత్త..!

ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా

చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...

రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..

లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!

Photos

+5

సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)

+5

తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)

+5

మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)

+5

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)