Breaking News

మరో ఓటీటీకి దురంధర్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Thu, 06/18/2026 - 09:10

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. గతేడాది డిసెంబర్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.

అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌కు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

 కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.

 

 

 

Videos

Ambati: వీళ్ళందరూ హంతకులే..!

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్

రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు

రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

Photos

+5

విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి: సీపీ సజ్జనార్‌ (ఫొటోలు)

+5

త్రిష కంటే ఎక్కువ హైలైట్.. సోషల్ మీడియాలోనూ ఈమెనే ట్రెండింగ్ (ఫొటోలు)

+5

'పెద్ది' రిజెక్ట్ చేసి.. ఇప్పుడు హీరోని డామినేట్ చేసి.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)