Breaking News

దురంధర్‌-2 కలెక్షన్స్‌.. తెలుగు సినిమాల రికార్డ్స్ కష్టమే..!

Published on Thu, 04/02/2026 - 17:27

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్‌ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్‌ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది.  ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. 
 

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)