Breaking News

మిడ్ రేంజ్ హీరోలకు డేంజర్ బెల్స్.. లేటెస్ట్‌గా విశ్వక్

Published on Mon, 02/16/2026 - 18:21

గత కొన్నేళ్లుగా చూసుకుంటే తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు ఎప్పటికప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రేక్షకుల పల్స్ వీళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారా? సరైన స్టోరీలని ఎంపిక చేసుకోలేకపోతున్నారా? తెలియట్లేదు గానీ చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. ఒకవేళ సక్సెస్ అయినా సరే కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ విశ్వక్ సేన్. వరసపెట్టి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్' లాంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాత చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కెరీర్ ఏ మాత్రం ఆశజనకంగా లేదు. 2024లో ఏకంగా మూడు చిత్రాలతో వస్తే.. వాటిలో 'గామి' ప్రయోగాత్మక చిత్రం కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటే.. 'మెకానిక్ రాకీ' ఘోరంగా దెబ్బతింది. గతేడాది ఇదే టైంకి వచ్చిన 'లైలా' అయితే అల్ట్రా డిజాస్టర్. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' చేశాడు. ఇదీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.

ఒకప్పటితో పోలిస్తే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ ఎలా తగ్గిపోయిందో.. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అలానే తగ్గిపోతూ వస్తున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడి చేతిలో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్, దర్శకుడిగా చేస్తున్న 'కల్ట్' ఉన్నాయి. ఈ రెండింటితోనైనా విశ్వక్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)

విశ్వక్ సేన్ మాత్రమే కాదు టాలీవుడ్‌లో చాలామంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్ దాదాపు ఇలానే ఉంది. గోపీచంద్, రవితేజ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. వీళ్లు సినిమాలైతే చేస్తున్నారు గానీ అటు కంటెంట్ పరంగా ఇటు మార్కెట్ పరంగా రెండూ వర్కౌట్ కావట్లేదు. వసూళ్లు కూడా పెద్దగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, శర్వానంద్, అల్లరి నరేశ్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే.

పైన చెప్పిన హీరోలు.. తాము అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్పుడో ఇప్పుడో అన్నట్లు వస్తున్నారు. కానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వీళ్లు కాకుండా ఉన్న మిగతా మిడ్, చిన్న రేంజ్ హీరోల పరిస్థితి అయితే అంతకంటే దారుణంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో ఏంటో అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )