KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
Published on Wed, 02/04/2026 - 21:10
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు.
తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.
(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)
అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు.
ఆ పాట పాడినందుకు బాధపడటం లేదు
నేను ఎవరికీ సారి చెప్పను
ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదు
మూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారు
ఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?
- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026
Tags : 1