ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?

Published on Fri, 01/30/2026 - 19:09

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.

జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్‌ మూవీని కట్‌ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  ఈ చిత్రం ప్రారంభంలో  3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు,  బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్‌ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని  చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్‌ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్‌ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.

నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్‌ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్‌ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద  ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ  స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
 

Videos

12 కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఇన్వెస్టర్లకు పండగే..!

కూటమి మహాపచారంపై YSRCP పాప ప్రక్షాళన

కోఠిలో కాల్పుల కలకలం.. గన్ తో కాల్చి రూ.6 లక్షలతో పరార్

రాజకీయాలకోసం దేవుడిని అడ్డం పెట్టుకున్నారు.. మీ పతనం మొదలైంది..

హిందూపురం YSRCP దీపికా ఇంటి వద్ద అర్ధరాత్రి పోలీస్ డ్రామా..

బరితెగించిన కూటమి ప్రభుత్వం.. దేవుడితోనే రాజకీయాలు..

పిన్నెల్లి సోదరులను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

GST 2.0పై గంపెడు ఆశలు.. EV లపై భారీ రాయితీ..?

గుడికి వెళ్లి వస్తుంటే.. ఆడపిల్ల అని కూడా చూడకుండా..

కీచక శ్రీధర్.. మరో సంచలన వీడియో లీక్.. ఏకంగా అసెంబ్లీ నుండే..

Photos

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)

+5

నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)

+5

నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)

+5

అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భగవంతుడు మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)