Breaking News

ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Published on Sat, 01/24/2026 - 17:50

ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. కాకపోతే థియేటర్లలో రిలీజైనప్పుడు అవి ఎక్కువమంది దృష్టిలో పడకపోవడం వల్ల కనుమరుగైపోతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'పతంగ్'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)

కొన్ని చిత్రాల్లో చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏముండదు. 'పతంగ్' కోసం దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న ట్రయాంగిల్ ప్రేమకథ కూడా అలాంటి రొటీన్ లైనే. కాకపోతే దీనికి ఇచ్చిన ట్రీట్‌మెంట్, డైలాగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఆర్య, ప్రేమదేశం లాంటి ప్రేమకథని హైదరాబాద్ స్టైల్లో చెబితే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ యువతని ఆకట్టుకునేలా ఉంటాయి. యూత్ మూవీ అని బూతుల్లాంటివి ఏం పెట్టలేదు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరగా సినిమా చూడొచ్చు. ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

'పతంగ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ(వంశీ పూజిత్‌), అదే ప్రాంతంలో ఉండే అరుణ్‌(ప్రణవ్‌ కౌశిక్‌) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి  ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ(ఓటీటీ))

Videos

జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్

బొగ్గు కుంభకోణంపై భట్టికి హరీశ్ రావు మాస్ కౌంటర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలతో ఆటలాడుతున్నాయి: రామచందర్ రావు

నాంపల్లి ప్రమాదానికి కారణం అదే

Khammam: జెండా పాటకు విరుద్ధంగా కొనుగోలు భగ్గుమన్న మిర్చి రైతులు

RK Roja : మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది

జపాన్ లో పెరిగిన వృద్ధాప్య రేటు భారీగా ఉపాధి అవకాశాలు..!

Nampally: ఘోర అగ్నిప్రమాదం..రంగంలోకి దిగిన రోబో

యూనివర్సిటీలో విద్యార్థులను బెదిరించి లోకేష్ పుట్టినరోజు వేడుకలు

54 ఎకరాలు ఖరీదైన భూమి అప్పనంగా గీతం సంస్థలకు...విశాఖ ప్రజలు మేలుకోకపోతే

Photos

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)

+5

రోగి సహాయకుల కష్టాలు... ఆసుపత్రికెరుక! (ఫోటోలు)

+5

‘చాయ్ వాలా’ మూవీ సాంగ్ ను లాంచ్ చేసిన CP సజ్జనార్ (ఫోటోలు)

+5

నిహారిక 'పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌' పదేళ్ల జర్నీ వేడుక (ఫోటోలు)

+5

శ్రీకాకుళం : ఉల్లాసంగా రథసప్తమి సప్తాహ్‌ (ఫోటోలు)

+5

శ్రీకాకుళం : శోభా యాత్ర శోభాయమానం (ఫోటోలు)

+5

మణికొండ : నార్సింగిలో సందడిగా పశుసంక్రాంతి (ఫోటోలు)