జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
Published on Wed, 01/21/2026 - 21:58
రణ్‌వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది.
The wait ends on January 30.
Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026
Tags : 1