మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
Published on Fri, 01/16/2026 - 17:46
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
2026లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..
టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల
దర్శకత్వం : హరీశ్ శంకర్
టైటిల్: పెద్ది
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్
దర్శకత్వం : బుచ్చిబాబు
టైటిల్: ది ప్యారడైజ్
నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబు
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
టైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47
నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టి
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
టైటిల్: ఆకాశంలో ఒక తార
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి
దర్శకత్వం: పవన్ సాదినేని
టైటిల్: ఛాంపియన్
నటీనటులు : రోషన్, అనస్వర రాజన్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
టైటిల్: ఫంకీ
నటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్
దర్శకత్వం : అనుదీప్ కేవీ
టైటిల్: ‘రాకాస’
సంగీత్ శోభన్, నయనసారిక
దర్శకత్వం: మాససా శర్మ
టైటిల్: బైకర్
నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్
దర్శకత్వం : . అభిలాష్ రెడ్డి
టైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)
నటీనటులు: విజయదేవరకొండ, రష్మిక
దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్
Tags : 1