29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
Breaking News
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
Published on Sun, 11/16/2025 - 19:14
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
#ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥
Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃
🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025
Tags : 1