'నా కెరీర్‌లో ఇదే ఫస్ట్‌ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!

Published on Wed, 11/12/2025 - 21:49

రామ్‌చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ  పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్‌ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు  బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్‌లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్‌ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.

ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్‌ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Videos

అప్పుల్లో రికార్డుల్ని తిరగరాస్తున్న బాబు.. ఏకంగా రూ.1,02,533 కోట్లు

మా వాళ్లు సంయమనం కోల్పోతే నీ పరిస్థితి.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉగ్రవాదుల టార్గెట్ జనవరి 26.. వెలుగులోకి సంచలన నిజాలు

మహిమ గల చెంబు మీ డబ్బులు డబుల్..!

అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. దేవుడి సాక్షిగా దొరికిపోయారు

భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు

కోటి గళాల గర్జన.. గ్రాండ్ సక్సెస్

ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి.. మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

సెంటు భూమి ఇవ్వలేదు... 3 లక్షల ఇళ్లు కట్టేశాడంట బాబును చీదరించుకుంటున్న జనం

ఇన్నాళ్లకు బయటపడ్డ కర్నూల్ బస్సు ప్రమాదం.. సంచలన వీడియో

Photos

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)