శ్రీలీల 'ఏజెంట్ మిర్చి'.. ఏంటి విషయం?

Published on Tue, 10/14/2025 - 15:20

యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది 'రాబిన్‌హుడ్', 'జూనియర్' సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న 'మాస్ జాతర' మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్‌గా మారింది.

(ఇదీ చదవండి: క్షమాపణ చెబుతూ మనోజ్ లెటర్ రాశాడు: మౌనిక)

'ఏజెంట్ మిర్చి'గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్‌గా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', శివకార్తికేయన్ 'పరాశక్తి', కార్తిక్ ఆర్యన్‌తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ధమాకా', 'భగవంత్ కేసరి'తో పాటు 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్‌పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)