Breaking News

ఎలిమినేషన్‌: కామనర్ల ఓవరాక్షన్‌.. ఆ కంటెస్టెంట్‌కు మూడినట్లే!

Published on Thu, 09/18/2025 - 16:09

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్‌లో ఏ నలుగురికి కెప్టెన్‌ అయ్యే అర్హత లేదో టెనెంట్స్‌ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్‌, పవన్‌ కల్యాణ్‌లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్‌ పవన్‌, మర్యాద మనీష్‌లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్‌ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్‌ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్‌లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్‌ ఉంది.

నామినేషన్స్‌లో ఏడుగురు
ఈ వారం మనీష్‌, హరీశ్‌, సుమన్‌ శెట్టి, ప్రియ, డిమాన్‌ పవన్‌, ఫ్లోరా, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్‌ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్‌, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్‌ ఓవరాక్షన్‌తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్‌లో ఒకరిని ఎలిమినేట్‌ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్‌ చేస్తున్నారు. 

డేంజర్‌ జోన్‌లో ముగ్గురు
దీంతో మనీష్‌, ప్రియ, డిమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. డిమాన్‌ పవన్‌.. తన గేమ్‌ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్‌ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్‌.. వరస్ట్‌ కామనర్స్‌ అంటూ తన టీమ్‌నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్‌ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ‍ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్‌, పవన్‌లపైనే ఎలిమినేషన్‌ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది చూడాలి!

 

చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..!

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే