బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ | woman conductor jumped to the rtc bus | Sakshi
Sakshi News home page

బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్

Jul 17 2015 11:48 AM | Updated on Sep 3 2017 5:41 AM

బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్

బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్

ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించిన అధికారులకు.. తీసుకున్న టికెట్ల కన్నా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ఉన్నారని.. తెలవడంతో కండక్టర్ పై రిమార్క్ రాశారు.

పశ్చిమగోదావరి: ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించిన అధికారులకు.. తీసుకున్న టికెట్ల కన్నా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ఉన్నారని.. తెలవడంతో కండక్టర్ పై రిమార్క్ రాశారు. దీంతో మనస్తాపం చెందిన ఓ మహిళా కండక్టర్ బస్సులోంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలోని ఎల్‌ఎన్‌డీ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది.

వివరాలు.. జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బి.పద్మావతి కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్‌ఎన్‌డీ కాలనీ వద్ద తనఖీ అధికారులు బస్సు ఆపి తనిఖీ చేయగా.. టికెట్ల కన్నా బస్సులో 18 మంది ప్రయాణికులు ఎక్కువ ఉన్నట్టు గమనించారు. దీంతో కండక్టర్ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ రిమార్క్  అధికారలు రిమార్క్ రాశారు. ఇది గమనించిన పద్మావతి బస్సులోంచి కిందికి దూకేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement