చంద్రబాబు మోసగాడు: కృష్ణ మాదిగ | chandra babu is a cheater, says manda krishna madiga | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసగాడు: కృష్ణ మాదిగ

Mar 4 2015 8:10 PM | Updated on Sep 15 2018 3:07 PM

చంద్రబాబు మోసగాడు: కృష్ణ మాదిగ - Sakshi

చంద్రబాబు మోసగాడు: కృష్ణ మాదిగ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని, ఆయనను విశ్వసించలేమని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎమ్ఎస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

హన్మకొండ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని, ఆయనను విశ్వసించలేమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
 
అలాగే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు పెట్టించి చట్టబద్ధత కల్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు జరుగుతున్న సమయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీకుకెళ్లాలని కోరుతూ మార్చి 18న అసెంబ్లీ ముట్టడిస్తామని మంద కృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement