ఉత్కంఠ పోరులో విండీస్‌ విజయం | West Indies Beat India in a Nail-Biter to Stay Alive in the Series | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో విండీస్‌ విజయం

Jul 3 2017 7:58 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఉత్కంఠ పోరులో విండీస్‌ విజయం

ఉత్కంఠ పోరులో విండీస్‌ విజయం

రెండు వరుస విజయాలతో జోరుమీద ఉన్నకరీబియన్‌ పర్యటనలో భారత జట్టుకు ఆతిథ్య విండీస్‌ షాక్‌ ఇచ్చింది.

ఆంటిగ్వా: రెండు వరుస విజయాలతో జోరుమీద ఉన్నకరీబియన్‌ పర్యటనలో భారత జట్టుకు ఆతిథ్య విండీస్‌ షాక్‌ ఇచ్చింది. నాలుగో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలనుకున్నభారత్‌ ఆశలకు గండి కొట్టింది. సిరీస్‌లో విండీస్‌ తొలి విజయాన్నినమోదు చేసుకుంది. 190 పరుగుల స్వల్ప ఛేదనకు దిగిన భారత్‌, 49.4 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. ఉత్కంఠగా సాగిన పోరులో వెండీస్‌ 11 పరుగుల తేడాతో సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్‌మెన్‌ రహానె 60(91), మహేంద్రసింగ్‌ ధోనీ 54(114) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. విండీస్‌ సారథి జేసన్‌ హోల్డర్‌ 9.4 ఓవర్లలో 27 పరుగులకే ఐదు వికెట్లు తీసి విండీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. భారత బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌(3/36), హార్దిక్‌ పాండ్య(3/40), కుల్‌దీప్‌(2/31)లు బంతితో రాణించడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేసింది. లూయిస్‌ 35(60), కైల్‌ హోప్ 35 (63), షెయ్‌ హోప్‌ 25 (39)లు పర్వాలేదనిపించారు. విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

విఫలమైన టాప్‌ ఆర్డర్‌
సిరీస్‌ తొలి మ్యాచ్‌ నుంచి రాణిస్తున్న భారత టాప్‌ ఆర్డర్‌ నాలుగో వన్డేలో ఘోరంగా విఫలమైంది. బంతితో బౌలర్లులు రాణించి విండీస్‌ను కట్టడిచేసినా బ్యాటింగ్‌లో విఫలమైంది. స్వల్ప లక్ష్యంతో బరలో దిగిన భారత బ్యాట్‌ మెన్లను ఆతిథ్య బౌలర్లు భారత్‌ను నిలువరించడంలో విజయవంతమయ్యారు. ఆరంభంలోనే శిఖర్‌ ధావన్‌(5)ను, జోషెఫ్‌ పెవిలియన్‌ పంపి విండీస్‌కు తొలి వికెట్‌ను అందించాడు. అనంతరం హోల్డర్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతికి విరాట్‌ కోహ్లి(3) వికెట్లముందు దొరికిపోగా.. జోసెఫ్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌ కూడా అలాంటి బంతికే వెనుదిరిగాడు. ఇద్దరి క్యాచ్‌లను కీపర్‌ షెయ్‌ అందుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న జాదవ్‌(10), ను నర్స్‌ బోల్తా కొట్టించడంతో భారత్‌ పతనం మొదలైంది. తర్వాత వచ్చిన పాండ్య 20 (21) దూకుడుగా ఆడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఊపుమీదున్న పాండ్యాని హోల్డర్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ విండీస్‌ వైపు మళ్లింది. ధోని54(114) చేసిన ఒంటరి పోరాటం భారత్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement