మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు | Amrutham - Chandamama Lo gets 'A' certificate | Sakshi
Sakshi News home page

మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు

May 3 2014 10:59 PM | Updated on Sep 2 2017 6:53 AM

మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు

మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు

‘‘ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా

‘‘ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా’’ అని  దర్శకుడు గుణ్ణం గంగరాజు చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమృతం చందమామలో’. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీశ్, వాసు ఇంటూరి ఇందులో ప్రధాన పాత్రధారులు.

 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో గంగరాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని, సినిమా ఎక్కువ భాగం బ్లూ మేట్‌లోనే తెరకెక్కించామని, కేవలం డీఐకే ఏడాది పైగా సమయం కేటాయించామని గంగరాజు తెలిపారు. మరికొన్ని విషయాలు ఆయన వివరిస్తూ- ‘‘నేను తీసిన ‘అమృతం’ సీరియల్ ఎంత పాపులరో తెలిసిందే. టీవీ రంగంలో నంబర్‌వన్ ధారావాహికగా నిలిచింది. యూట్యూబ్‌లోనే రెండు కోట్ల మంది ఆ సీరియల్ చూశారు.

 ‘చాలామంది ‘అమృతం-2’ చేయొచ్చు కదా’ అని అడుగుతుంటారు. అమృతం-2 చేసేబొదులు... ‘అమృతం-1’నే కొనసాగిస్తే పోయేదిగా అని నా వాదన. ఇదంతా దేనికనే ‘ఆమృతం’ ప్రేరణగా ‘అమృతం చందమామలో’ సినిమా చేశాను. నేను, వాసు ఇంటూరి కలిసి ఈ స్క్రిప్ట్ తయారు చేసుకొని సినిమా పూర్తి చేశాం. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా మాది మాత్రం ‘ఎ’ సర్టిఫికెట్ సినిమానే. అంటే... అందరూ చూడదగ్గ సినిమా అన్నమాట’’అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement