ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు | Lebanon nabs IS suicide bomber ahead of terror attack | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు

Jun 20 2017 8:56 AM | Updated on Nov 6 2018 8:35 PM

ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు - Sakshi

ఆత్మాహుతి దాడికి సిద్ధం.. అంతలో పట్టేశారు

లెబనాన్‌లో ఓ ఉగ్రవాది జాడలను అక్కడి భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)కు చెందిన అతడిని చాలా చక్యంగా బంధించాయి.

బీరుట్‌: లెబనాన్‌లో ఓ ఉగ్రవాది జాడలను అక్కడి భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)కు చెందిన అతడిని చాలా చక్యంగా బంధించాయి. నగరంలో పలు చోట్ల ఆత్మాహుతిదాడులు చేసేందుకు కుట్రలు చేస్తుండటంతోపాటు తాను కూడా ఆ ఆత్మాహుతి దాడిలో పాలుపంచుకునే యత్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఏ.ఏ అనే పేరుతో ఉన్న ఓ యువకుడు ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. అల్‌ నుస్రా ఫ్రంట్‌ గ్రూప్‌లో ఉన్న అతడు లెబనాన్‌లో పలు హింసాత్మక ఘటనలకు కారణమవుతున్న ఉగ్రవాది ఒసామా మాన్సోర్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు.

సోషల్‌ మీడియా ద్వారా కాంటాక్ట్‌ అవుతూ ఆదేశాలను పాటిస్తూ శిక్షణ పూర్తి చేసుకున్న అతడు ఆత్మాహుతిదాడికి సిద్ధంగా ఉండాలనే ఆదేశాలను పొందాడు. తాను ఎప్పుడు సంకేతాలు ఇస్తే అప్పుడు చేయాలని ఒసామా మాన్సోర్‌ అతడిని సిద్ధం చేశాడు. దీంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ఏ.ఏని లెబనాన్‌ సెక్యూరిటీ సిబ్బంది ట్రిపోలీలో జరిగిన ఘర్షణల్లో అదుపులోకి తీసుకున్నారు. అనుమానం వచ్చి అతడిని విచారించగా అసలు విషయం మొత్తం బయటపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement