ప్రచారం సెల్ చల్

ప్రచారం సెల్ చల్ - Sakshi


కాలంతో పాటు ప్రచారం పరుగులు

సోషల్ మీడియా, ఫోన్లద్వారా ప్రచారం

చివరి నిమిషం వరకు ఓటు కోసం యత్నాలు




నారాయణఖేడ్: ఎన్నికల ప్రచారాన్ని నాయకులు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారం ఈనెల గురువారం సాయంత్రంతో ముగిసి పోయింది. దీంతో పోలింగ్‌కు ఇంకా ఒక రోజు సమయం ఉండడంతో ఓటర్లను ఎలాగైనా ఆకట్టుకోవాలని ప్రచార మాధ్యమాలను, ఫోన్లను వాడుకుంటున్నారు. ఆయా ప్రధాన పార్టీలకు చెందిన నాయకు లు ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో యువతను, ఉద్యోగులను, ఫోన్ వినియోగదారులకు ఎలాగైనా త్వర గా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఎస్సెమ్మెస్‌లు పంపడంతో పాటు ఫేస్‌బుక్ ద్వారా సైతం చాటింగ్ చేయడం, తమ ప్రచారాన్ని వారి దగ్గరకు తీసుకెళ్ళేందుకు యత్నిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటరు ఓటువేసే చివరి నిమిషం వరకు తమ ప్ర యత్నాన్ని వృధా కానీయడంలేదు. వీలైనన్ని మార్గాల ద్వారా ఓ టరుకు దగ్గరయ్యేందుకు అభ్యర్థులు, పార్టీల నాయకులు య త్నిస్తున్నారు. దీంతోపాటు ఫోన్స్‌కాల్స్ ద్వారా కూడా ప్రచారా న్ని నిర్వహిస్తున్నారు.


తమను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఫలానా అభివృద్ధి చేస్తానని, తను ఆశీర్వదించాలని, తమ పార్టీని ఆదరించాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. తాము గెలుపొందితే పరి ష్కరించే సమస్యలనూ ప్రచార మాధ్యమాల ద్వారా వివరిస్తున్నారు. యువత సోషల్ మీడియాను అధికంగా వినియోగిస్తుండడంతో నాయకులు ఆ వర్గానికి దగ్గరై ఓటు అభ్యర్థించేందుకు తాము సైతం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.


 ఓటేసేందుకు ఈ కార్డులుంటే చాలు!

ఈ నెల 13న జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికను పురస్కరించుకొని ఓటరు గుర్తింపు కార్డును తమ వెంట తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఓటర్లు ఎపిక్‌కార్డు సమర్పించకుంటే తాము ఈ కింద చూపిన ఫొటోతో కూడిన ఏదైనా ఓ కార్డు పోలింగ్ రోజు తమ వెంటే పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ఆధార్ కార్డును ఎన్నికల కమిషన్ సూచించిన 11 కార్డుల జాభితాలో లేదు. ఓటు వేసేందుకు తీసుకెళ్లాల్సిన కార్డులు


 1. పాసుపోర్టు, 2. డ్రైవింగ్ లెసైన్స్, 3. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పీఎస్‌యూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు, 4. బ్యాంకు, పోస్టాఫీస్ జారీచేసిన పాసుపుస్తకం, 5. పాన్‌కార్డు, 6. ఆర్‌జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 7. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీపథకం కింద జారీచేసిన జాబ్‌కార్డు, 8. కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యభీమా కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, 10. ఎన్నికల యంత్రాంగం జారీచేసిన ఫొటో స్లిప్, 11. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు అధికారికంగా జారీచేసిన గుర్తింపు కార్డు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top