టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు | tdp mla, DSP secret meeting in gospadu | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు

Aug 23 2017 4:52 PM | Updated on Oct 19 2018 8:10 PM

ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.



నంద్యాల:
ఉప ఎన్నికలో భారీగా పోలింగ్‌ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికి పోలీసు అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం నేతలు పిలిచిన వెంటనే వారివద్ద వాలిపోయి, రహస్య సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికలను పరిశీలించాల్సిన పోలీసులు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. పోలింగ్‌ సమయం ముగుస్తుండటంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికలో భాగంగా గోస్పాడు మండలం ఆంజనేయ స్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డి, డీఎస్పీలు ఇలా చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement