
తాను రాజధాని అమరావతికి కన్సల్టెంట్‌ను కాదని సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు.
సాక్షి, అమరావతి: తాను రాజధాని అమరావతికి కన్సల్టెంట్‌ను కాదని సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు. అమరావతికి కన్సల్టెంట్‌గా, డిజైనర్ సూపర్‌వైజర్‌గా తాను నియమితుడిని అయినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ వచ్చిన రాజమౌళి రాజధాని డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చలు జరపడంపై విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో గురువారం ఆయన ఫేస్‌బుక్‌లో స్పందించారు.
ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్కిటెక్ట్ సంస్థ అని, అది ఇచ్చిన డిజైన్లు ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయనేది తన అభిప్రాయమని తెలిపారు. చంద్రబాబు ఆయన బృందం వీటిపై సంతోషంగానే ఉన్నారని, కానీ అసెంబ్లీ ఇంకా ఐకానిక్‌గా ఉండాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు భావాలు, అభిప్రాయాలను నార్మన్ ఫోస్టర్ సంస్థకు తెలియజెప్పి ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.