వైఎస్‌ జగన్‌ సీఎం కాకూడదనే..


  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు

  • రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి





  • అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఆయన అడుగుజాడల్లో వైఎఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్లీనరీ సమావేశాల్లో ఎస్‌ఆర్‌సీపీ రాజకీయ తీర్మానాన్ని మేకపాటి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక స్వాతంత్య్రం లేనిది రాజకీయ స్వాతంత్య్రం లేదని నమ్మిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు.



    మహానేత మరణంతో రాజకీయ శూన్యత

    ‘కనీస అవసరాలకు నోచుకోవాలని అందరి కనీస అవసరాలు తీర్చాలని మహానేత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 2004లో రెండు వాగ్ధానాలు మాత్రమే చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వృద్దులు, వికలాంగులకు పింఛన్లు ఇస్తానని చెప్పారు. మహానేత అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క పేదవారికి ఆహార భద్రత కల్పించారు. ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించకూడదని, ఆరోగ్యానికి ఇబ్బందులు రాకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యం, విద్యా, పక్కా ఇల్లు కల్పిస్తుందని ఎప్పడైనా ఊహించామా? ఇరిగేషన్‌ కింద 86 ప్రాజెక్టులు చేపట్టిన మహానీయుడు వైఎఆర్‌.  నీటి వసతి కల్పించేందుకు ఆయన చేపట్టిన జలయజ్ఞం చిరస్మరణీయం. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్లే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. అటువంటి మహానేతను దేశంలోనే ఇంతవరకు లేరు. ఆయన చనిపోయిన తరువాత రాజకీయ శూన్యత ఏర్పంది. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేకపోయారు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరుగకూడదని ప్రయత్నం చేసిన పార్టీలు వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం మాత్రమే.



    వైఎస్‌ జగన్‌ సీఎం కాకూడదనే రాష్ట్ర విభజన

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాలాంధ్రకు ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్యేశంతోనే రాష్ట్రాన్ని విభజించారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు.  



    ‘రాజ్యసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన పార్టీలు హోదా అంశాన్ని నీరుగార్చాయి. వైఎస్‌ఆర్‌ లేని కొరత తీర్చాలనే తపనతోనే వైఎస్‌ జగన్‌ 2011లో వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 5.45 లక్షల మెజారిటీ వచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు నిరంకుశంగా పాలిస్తున్నారు. ఎన్నికల వాగ్ఢానాలు నెరవేర్చడంలో టీడీపీ విఫలమైంది. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. టీడీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 108 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నా.. ఆ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా మన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదువులు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు.



    గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ స్థాపిస్తే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కుట్ర పూని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని 16 నెలల పాటు జైలులో పెట్టారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఆ బాధ్యతలు తీసుకొని ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పథకాలన్నీ అందరికీ అందాలని చెబుతుంటే, చంద్రబాబు మాత్రం జన్మభూమి కమిటీలు పెట్టి పథకాలన్ని పచ్చ పార్టీ నేతలకే కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించకుండా కాపాడుతున్నారు’.



    ఏడాదిలో ఎన్నికలు!

    ‘రాబోయే సమయం చాలా కీలకం. ఏపీ ప్రజలంతా దయచేసి ఆలోచించాలి. చంద్రబాబుకు తిరిగి అవకాశం ఇవ్వొద్దు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వాలి. మీరు చెప్పబోయే తీర్పు రాజకీయ భవిష్యత్తు కావాలి. ఏ పార్టీలోనైనా సరే పార్టీ బీఫారం తీసుకొని గెలిచిన తరువాత వారు పార్టీ మారాలంటే ఆ పదవికి రాజీనామా చేయాలి. ఇంకా ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. అందరూ సమయాత్తం కావాలి’.



    రాజకీయ తీర్మానం

    –పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలి

    – ప్రజాస్వామ్య మనుగడకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి. ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చాలి.

    –దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తారు. ఆయన్ను ముఖ్యమంత్రి చేద్దాం.

    – మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాలను ఎమ్మెల్యే కొడాలి నాని బలపరిచారు.


     


    సంబంధిత కథనాలు


    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన



    అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి



    ‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top