...లేదంటే మహా ఉద్యమమే | Sakshi
Sakshi News home page

...లేదంటే మహా ఉద్యమమే

Published Thu, Dec 5 2013 2:07 AM

However, the movement ...

 =తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్
 =నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

 
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదన విరమించుకోవాలి.. లేదంటే తెలంగాణ ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుం దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ బుధవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు  చేస్తే సివిల్‌వార్ తీసుకొస్తామం టూ ఏపీ ఎన్జీవోస్ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ.. పోరాటం ఎలా చేయాలో ఈ ప్రాంత బిడ్డలకు తెలుసన్నారు. హైదరాబా ద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడి రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాటి బంద్‌లో ఉద్యోగులంతా పాల్గొంటున్నామని, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షు డు కోల రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాయల తెలంగాణను నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసాలను అడ్డుకుంటామన్నారు. మహాధర్నాలో ఉద్యోగులంతా పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు దాస్యానాయక్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రాంకిషన్, సోమయ్య, ధరంసింగ్, శ్రీనివాస్, శ్యాంసుం దర్, సలీం, వేణు, రమేశ్, రత్నాకర్‌రెడ్డి, కిరణ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement