పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’

Published Fri, May 24 2024 10:20 AM

పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’

దేవనకొండ: ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కరిడికొండ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. రక్తహీనత సమస్యలున్న హై రిస్క్‌ గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి విజయభాస్కర్‌, వైద్య సిబ్బంది రంగస్వామి, శ్రీధర్‌, హనుమంతమ్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement