అక్కా, బావను దారుణంగా హతమార్చాడు.. | double murder in guntur district | Sakshi
Sakshi News home page

అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..

Jun 27 2017 1:16 PM | Updated on Sep 5 2017 2:36 PM

అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..

అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో దారుణం చోటుచేసుకుంది.

రొంపిచర్ల : గుంటూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం అన్నవదినను ఓ తమ్ముడు నరికి చంపిన దుర్ఘటనను మరిచిపోకముందే, మరో దుర్ఘటన అదే జిల్లాలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం వీరపట్నంలో సోదరి సుబ్బమ్మ, బావ రమేష్‌ రెడ్డిపై రామిరెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో రమేశ్‌రెడ్డి, అతడి భార్య సుబ్బమ్మ ఘటనాస్థలంలోనే చనిపోయారు. కాగా ఆస్తి వివాదాలే హత్యలకు కారణమని బంధువులు చెబుతున్నారు. 

మూడు ఎకరాల పొలం గురించి అక్క సుబ్బమ్మ, ఆమె సోదరుడు రామిరెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు, ఆ పొలాన్ని ప్రస్తుతం  అక్కా,బావే సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి పథకం ప్రకారం సోదరిని ఇంట్లో, పొలంలో పనిచేసుకుంటున్న బావ రమేష్‌ను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement