
లోకేష్ నిమ్మకూరు...బ్రాహ్మణి నారావారిపల్లె
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా ఆకర్షితులయ్యారు
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా ఆకర్షితులయ్యారు. స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులంతా తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ దత్తత తీసుకోగా, అదే జిల్లాలోని కొమరవోలు (ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పుట్టిల్లు) గ్రామాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. ఇక చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెను కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలను వారు అభివృద్ధి చేయనున్నారు.