శివప్రసాద్‌పై చర్యలు తప్పవు

శివప్రసాద్‌పై చర్యలు తప్పవు - Sakshi


చిత్తూరు ఎంపీపై బాబు ఆగ్రహం



సాక్షి, అమరావతి: తాను దళితులను పట్టిం చుకోవట్లేదంటూ సొంత పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర విమర్శలు చేయడంతో కంగుతిన్న సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. శనివా రం ఉదయం మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యవహారంపై చర్చించి న సీఎం.. ఆ తర్వాత శివప్రసాద్‌ మరలా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యనేతలతో మరోసారి చర్చించారు. ఉదయం మంత్రులతో టెలీకా న్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం .. శివప్రసాద్‌ విమర్శలను ప్రస్తావించి ఆయన పద్ధతి సరిగా లేదని అన్నట్లు తెలిసింది.  ఏం జరిగిందని చిత్తూరు జిల్లా నేతలను ప్రశ్నించారు. అంబేద్కర్‌ జయంతి రోజున అంతా బాగా చేయాల నుకుంటే ఆయన అదేరోజు ఇలా చేశాడే మిటని వాపోయారు.



తనను విమర్శిస్తున్నా ఎవరూ స్పందించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించడంతో టెలీకాన్ఫరెన్స్‌ ముగిశాక ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌.. ఎంపీపై విమర్శలు చేశారు. అనంతరం శివప్రసాద్‌ మరింత దూకుడుగా  విమర్శలు చేయడంతో మధ్యాహ్నం  చంద్ర బాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే ముఖ్యనేతలతో మాట్లాడారు. ఆరునెలల నుంచి శివప్రసాద్‌ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండట్లేదన్నారు. హథిరాంజీ మఠం భూములు దళితులకివ్వాలని అడిగాడని, ఆ పని చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి చేయనన్నానని, దాన్ని మనసులో పెట్టుకుని అంబేడ్కర్‌ జయంతిరోజు తనపై విమర్శలు చేశాడని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటానని  స్పష్టం చేసినట్లు తెలిసింది.

(నేనేం తప్పు మాట్లాడాను?: చంద్రబాబుపై శివప్రసాద్‌ ఆగ్రహం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top