వైఎస్ఆర్సిపిలో చేరిన ఎంపి అనంత వెంకటరామిరెడ్డి | Ananta Venkataramireddy joined YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సిపిలో చేరిన ఎంపి అనంత వెంకటరామిరెడ్డి

Mar 9 2014 7:30 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్సిపిలో చేరిన ఎంపి అనంత వెంకటరామిరెడ్డి - Sakshi

వైఎస్ఆర్సిపిలో చేరిన ఎంపి అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం లోక్సభ సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: అనంతపురం లోక్సభ సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

రాష్ట్ర విభజన విషయంలో వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. ఆయన మొదటి నుంచి సమైక్యవాదిగానే చెబుతూ వచ్చారు. కొద్దికాలం నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. ఈ రోజు మౌనం వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు.  అనంత వెంకట్రామిరెడ్డితో పాటు  మాజీ జెడ్పీ టీసీ రెడ్డివారి నాగరాజు, మాజీ ఎఎంసీ చైర్మన్ ఎన్.సత్యనారాయణరెడ్డి, తాడిపత్రి నాయకులు రంగారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.

ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో  ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మండల కన్వీనర్లు, ముగ్గురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు  వైఎస్ఆర్ సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement