Breaking News

ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..

Published on Tue, 04/15/2025 - 08:41

నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్‌ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి హాస్టల్‌లో ఉంటూ నిమ్స్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్‌లో విషపూరితమైన ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)