Breaking News

జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్‌జామ్‌

Published on Wed, 01/28/2026 - 06:57

సాక్షి, హైదరాబాద్‌: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. 

మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. 

మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.

నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.

Medaram : భక్తులతో కిక్కిరిపోతున్న మేడారం గద్దె

రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)