Breaking News

పట్టుకోసం బీఆర్‌ఎస్‌.. పాగా వేయాలని కాంగ్రెస్‌..

Published on Tue, 10/14/2025 - 07:57

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్‌ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్‌ఎస్‌ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ యువనేత వి.నవీన్‌యాదవ్‌ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్‌ రాషేద్‌ పరాజుద్దీన్‌కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్‌ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 

2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్‌.. 
2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్‌ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. 

 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)