Breaking News

అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి

Published on Sat, 11/29/2025 - 18:00

సాక్షి, హైదరాబాద్‌: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్‌ నుంచి కీలక సమాచారాన్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్‌లలో మొత్తం 21 వేల సినిమాలు అప్‌లోడ్‌ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ గురించి రవి సైబర్‌ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. 

పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్‌ బొమ్మ. ఇంటర్నెట్‌లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్‌సైట్‌ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్‌ నేమ్‌లో ఎల్‌(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. 

పైరసీ వెబ్‌సైట్స్‌ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్‌ చేయగలిగాం. అలా రికార్డింగ్‌ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్‌ దీవుల్లో ఔట్‌ సోర్సింగ్‌ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్‌లోడ్‌ చేసిన సినిమాలను టెలిగ్రామ్‌ చానెల్స్‌ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.

ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. 

రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్‌వర్క్‌, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు