Breaking News

ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్‌ షాక్‌

Published on Thu, 12/11/2025 - 19:22

సాక్షి, హైదరాబాద్‌: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్‌ షాక్‌ తగిలింది. బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్‌ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్‌ కస్టడీ కారణంగా రవి బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. 

మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్‌ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్‌ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్‌ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. 

సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే..  స్క్రీన్‌ రికార్డింగ్‌ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్‌ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్‌ పోలీసుల కస్టడీ అప్పీల్‌ గనుక రిజెక్ట్‌ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)