Breaking News

జిల్లాలకు హైడ్రా తరహా వ్యవస్థ: సీఎం రేవంత్

Published on Tue, 09/03/2024 - 15:01

మహబూబాబాద్‌, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ముఖ్యమంతత్రి రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. మహబూబాబాద్‌లో వరద ప్రభావిత పప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

అక్రమ కట్టడాల వల్లే  ఈ పరిస్థితి నెలకొంది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నా.. అపార నష్టం వాటిల్లింది. అయితే ప్రభుత్వ ముందు చూపు వల్లే ప్రాణాపాయం మాత్రం తప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు మాత్రం దెబ్బ తిన్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ల కష్టనష్టాల గురించి తెలుసుకున్నాం

వరంగల్‌పై ప్రత్యేక దృష్టి డతాం. రాంనగర్‌ అక్రమకట్టడాలను తొలగించడం వల్లే వరద ముప్పు తప్పింది. చెరువ అక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఇలాంటి కట్టడాలకు సహకరించిన అధికారులపైనా చర్యలు ఉంటాయి. కొంతమంది ఆనయకులు నాపై విమర్శలు చేస్తుంటారు. ప్రజల మంచి కోసం అన్నింటిని భరిస్తా. 

.. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అక్రమ కట్టడాలు కట్టారు. పువ్వాడ అక్రమ కట్టడాలు తొలగించాలని హరీష్‌రావు డిమాండ్‌ చేయగలరా?. తెలంగాణలో గత పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌ ఏనాడైనా పరామర్శించారా?. మాసాయిపేటలో రైలు కింద పడి పిల్లలు చనిపోతే వెళ్లారా?. అవుటర్‌ రింగ్‌ రోడ్డు కింద అమ్మాయిని హత్యాచారం చేస్తే.. ఆ కుటుంబాన్ని ఓదార్చారా?. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్లలేదా? అని సీఎం రేవంత్‌ నిలదీశారు. 

ఆకేరు వరదలతో విపరీతమైన నష్టం జరిగింది.  మరిపెడ మండలంలోని మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. మూడు తండాలను కలిపి ఓకే చోట కాలనీలను నిర్మిస్తాం. అందరికీ ఓకేచోట ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు.. మేకలు చనిపోతే రూ.5 వేలు అందిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం. పంట నష్టాన్ని అంచనా వేసి.. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తాం. వరద సహాయక చర్యలపై కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. 

మెడికల్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులు, అధికారులు కలిసి. పని చేయాలి. బురద కడగడానికి వీలైనన్ని ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలి. ఈ వరదలను కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వీలైనంత తక్కువ నష్టంతో బయటపడే ప్రయత్నం చేస్తున్నాం.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)