Breaking News

చైనా మాంజాపై హైదరాబాద్‌ పోలీసుల ఉక్కు పాదం

Published on Thu, 01/08/2026 - 15:39

సాక్షి, హైదరాబాద్‌: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. 

చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది.  ఇండస్ట్రీయల్‌ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్‌ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్‌ హెచ్చరించారు. 

చైనా మాంజాపై బ్యాన్‌ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. 

నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్‌, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న  రెండు ఫ్యాక్టరీలను సీజ్‌ చేసినట్లు.. గుజరాత్‌, రాజస్థాన్‌ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)