Breaking News

ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?

Published on Sun, 10/19/2025 - 06:13

సాక్షి, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్‌: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్‌ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)