Breaking News

కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!

Published on Fri, 11/06/2026 - 09:37

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు పడిన కుమార్తెను కాపాడబోయి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం కోటాల్‌పల్లి గ్రామంలోని గోరిగారి చెరువులో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి పెద్ద నర్సింలు (60), ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (40) చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రజిత ప్రమాదవశాత్తు చెరువులో జారిపడింది. గమనించిన తండ్రి ఆమెను కాపాడేందుకు వెంటనే నీటిలోకి దిగాడు.

అయితే, కుమార్తెను రక్షించే ప్రయత్నంలో నర్సింలు కూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, తండ్రి, కుమార్తె మృతదేహాలను వెలికితీశారు.

అనంతరం పోలీసులు మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోటాల్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. మృతుల్లో చిన్నారులు, మహిళలు..

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)