Breaking News

చిన్నారుల భవిష్యత్తుకు సైబరాబాద్ పోలీసుల భరోసా

Published on Wed, 02/04/2026 - 20:41

హైదరాబాద్‌: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.

ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై  ఆవేదన వ్యక్తం చేశారు.

‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు.

"పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు