Breaking News

ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసు.. నిందితుడికి హైదరాబాద్‌ లింక్స్‌

Published on Tue, 12/16/2025 - 16:41

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్‌ అక్రమ్‌ అనే వ్యక్తికి హైదరాబాద్‌ నగరంతో లింక్స్‌ ఉన్నట్లు వెల్లడైంది. సాజిద్‌ హైదరాబాద్‌లో వీసా పొందినట్లు గుర్తించారు. స్టూడెంట్‌ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్‌.. 2001లో పార్టనర్‌ వీసాగా మార్చుకున్నాడు. 

ఆపై 2002లో రెసిడెంట్‌ రిటర్న్స్‌ వీసా పొందాడు సాజిద్‌. 2022లో టోలీచౌక్‌లోని ఆస్తులను అమ్ముకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోనే బీకామ్‌ డిగ్రీ పూర్తి చేసిన్‌ సాజిద్‌.. అక్కడ యూరోపియన్‌ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. సాజిద్‌ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని, తిరిగి భారత్‌కు ఆరుసార్లు మాత్రమే వచ్చాడన్నారు. సాజిద్‌తో తెలంగాణకు కానీ, భారత్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వెల్లడించారు. 

సాజిద్ చివరిసారిగా 2022లో భారత్‌కు..
భారతదేశంలోని సాజిద్ బంధువుల ప్రకారం, గత 27 సంవత్సరాలుగా సాజిద్ కు తన కుటుంబంతో చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అతను ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. దీనికి కారణం ఆస్తికి సంబంధించిన కుటుంబ సమస్యలు. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, సాజిద్ చివరిసారిగా 2022లో భారతదేశాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను భారతదేశాన్ని సందర్శించలేదని సమాచారం. సాజిద్ లేదా నవీద్ యొక్క తీవ్రమైన అభిప్రాయాలు లేదా కార్యకలాపాల గురించి తమకు తెలియదని కుటుంబం వాదిస్తోంది.

అంతకుముందు, సాజిద్ అక్రమ్ గత నెల నవంబర్ 1న తన కుమారుడు నవీద్‌తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడని ఫిలిప్పీన్స్ అధికారులను ఉటంకిస్తూ  సీఎన్‌ఎన్‌ ప్రచురించింది.

సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించగా, అతని కుమారుడు ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు. వారు ఒక నెల నుండి దాడికి ప్రణాళిక వేశారు

కాగా, ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం(డిసెంబర్‌ 14వ తేదీ) ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. ‍

ఇదీ చదవండి:

బీచ్‌ అటాక్‌.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు..

బాండీ బీచ్‌ హీరోకు సర్వత్రా ప్రశంసలు.. భారీ విరాళాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)