Breaking News

వామ్మో వాన!

Published on Fri, 07/28/2023 - 00:56

నేడు పది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ 
రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను.. మిగతా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40– 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. అయితే పశ్చిమ, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని, ఇకపై వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.  

ఇదే అతిపెద్ద వాన 
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో నమోదైన 64.98 సెంటీమీటర్ల వర్షపాతమే రాష్ట్ర చరిత్రలో అత్యధి కమని వాతావరణశాఖ తెలిపింది. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నమోదైన 61.65 సెంటీమీటర్ల వర్షపాతం రెండో అతిపెద్ద రికార్డును నమో దు చేసినట్టు వెల్లడించింది. 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెం.మీ. వాన ఇప్పటివరకు టాప్‌ అని.. ఇప్పుడది 3వ స్థానానికి పడిపోయిందని వివరించింది. ఇక కేవలం 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని 35కుపైగా ప్రాంతాల్లో 20సెంటీమీటర్లకుపైన వర్షపాతం నమోదవడం కూడా రికార్డేనని తెలిపింది. 

సాక్షి, హైదరాబాద్‌:  కుండపోత, కుంభవృష్టి కాదు.. ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అనిపించేట్టుగా అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో వానలు పోటెత్తాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 24 గంటల వ్యవధిలో (బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 వరకు) ఏకంగా 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన, మరో 200 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లపైన భారీ వర్షాలు నమోదుకావడం గమనార్హం.

ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు కుండపోత వానలతో అతలాకుతలం అయ్యాయి. ఉప నదులు, వాగులు ఉప్పొంగుతుండటం, చెరువులు, చిన్న ప్రాజెక్టులు అలుగు పారుతుండటంతో.. చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. భూపాలపల్లిలోని మోరంచ వాగు ఉధృతికి గ్రామం పూర్తిగా నీట మునగడంతో.. అక్కడి వారిని రక్షించడానికి హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చగా.. కృష్ణా నదిలోనూ ప్రవాహం పెరుగుతోంది. 


రాష్ట్రంలో 9.77 సెంటీమీటర్ల సగటు 
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో అయితే ఏకంగా 27.59 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 26.46, వరంగల్‌ జిల్లాలో 21.46, కరీంనగర్‌ జిల్లాలో 20.10 సెంటీమీటర్ల సగటు వర్షం పడటం గమనార్హం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)